నిన్ను ప్రేమించానా ? నిజంగా ప్రేమించానా ?
నీ చుట్టూ రెండు సంవత్సరాలు తిరిగాను
మొదటిసారి నిన్ను చూసి దేవకన్య అనుకున్నా
నువ్వెక్కడ …… నేనెక్కడ…..
మొఖం మీద మొటిమలు, అంత మంచి రంగు కూడా కాదు
పోనీ నా శరీర సౌష్టవం ? ముఖంలో కళ ? ఉఁహు
అయినా నువ్వు నన్ను ప్రేమిస్తావని నీవెంట పడ్డానా ?
లేక నీ అందాన్ని చూడాలని నువ్వెక్కడికెలితె అక్కడికొచ్చానా ?
అసలు నువ్వెందుకు నన్ను ప్రేమించావు ?
నా మనస్సులో నీకిప్పుడు చోటు లేదనిపిస్తుంది
నా భవిష్యత్తు గుర్తుకొచ్చిందా ?
ఇంత అందమైన అమ్మాయి నన్ను ప్రేమించిందని గర్వం నిండిందా ?