ఆకర్షణ

నిన్ను ప్రేమించానా ? నిజంగా ప్రేమించానా ?

నీ చుట్టూ రెండు సంవత్సరాలు తిరిగాను

మొదటిసారి నిన్ను చూసి దేవకన్య అనుకున్నా

నువ్వెక్కడ …… నేనెక్కడ…..

మొఖం మీద మొటిమలు, అంత మంచి రంగు కూడా కాదు

పోనీ నా శరీర సౌష్టవం ? ముఖంలో కళ ? ఉఁహు

అయినా నువ్వు నన్ను ప్రేమిస్తావని నీవెంట పడ్డానా ?

లేక నీ అందాన్ని చూడాలని నువ్వెక్కడికెలితె అక్కడికొచ్చానా ?

అసలు నువ్వెందుకు నన్ను ప్రేమించావు ?

నా మనస్సులో నీకిప్పుడు చోటు లేదనిపిస్తుంది

నా భవిష్యత్తు గుర్తుకొచ్చిందా ?

ఇంత అందమైన అమ్మాయి నన్ను ప్రేమించిందని గర్వం నిండిందా ?

వ్యాఖ్యానించండి