ఆకర్షణ

07/06/2009

నిన్ను ప్రేమించానా ? నిజంగా ప్రేమించానా ?

నీ చుట్టూ రెండు సంవత్సరాలు తిరిగాను

మొదటిసారి నిన్ను చూసి దేవకన్య అనుకున్నా

నువ్వెక్కడ …… నేనెక్కడ…..

మొఖం మీద మొటిమలు, అంత మంచి రంగు కూడా కాదు

పోనీ నా శరీర సౌష్టవం ? ముఖంలో కళ ? ఉఁహు

అయినా నువ్వు నన్ను ప్రేమిస్తావని నీవెంట పడ్డానా ?

లేక నీ అందాన్ని చూడాలని నువ్వెక్కడికెలితె అక్కడికొచ్చానా ?

అసలు నువ్వెందుకు నన్ను ప్రేమించావు ?

నా మనస్సులో నీకిప్పుడు చోటు లేదనిపిస్తుంది

నా భవిష్యత్తు గుర్తుకొచ్చిందా ?

ఇంత అందమైన అమ్మాయి నన్ను ప్రేమించిందని గర్వం నిండిందా ?

నమస్కారం

28/03/2009

అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.

నా బ్లాగును దర్శించినందుకు ధన్యవాదాలు.

ప్రతి మనిషికి ఎన్నో ఆలోచనలు, అనుభవాలు ఉంటాయి, వాటన్నింటిని వ్యక్తపరచడానికి బ్లాగ్ మంచి సాదనం. సోది పెడుతున్నాను కదా! ఓకె ఓకె.

ఇకముందు కూడా ఇలాగే చూసి మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, చీవాట్లు మొదలైన మీ అంతరంగాల్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తూ….

శ్రీనాథ్